మహీంద్రా నుంచి 5-డోర్ల థార్ మోడల్

by Harish |   ( Updated:2023-05-12 15:12:18.0  )
మహీంద్రా నుంచి 5-డోర్ల థార్ మోడల్
X

దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా & మహీంద్రా నుంచి ఎంతో ఆదరణ కలిగిన థార్ వేరియంట్‌లో కొత్తగా ఐదు-డోర్ల థార్ మోడల్ రానుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇది ఆగస్టు 15, 2023 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కానీ దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే ఈ ఐదు-డోర్ల థార్‌ను అనేక సార్లు పరీక్షించారు. ఇది డిజైన్ పరంగా చాలా అట్రాక్టివ్‌గా ఉండనుంది. పాత మూడు-డోర్ల థార్‌‌తో పోలిస్తే, కొత్త దానిలో సరికొత్త బాడీ ప్యానెళ్లను అందించనున్నారు. ఫ్రంట్ గ్రిల్, గుండ్రని ఆకారపు హెడ్‌లైట్లు, మస్కులర్ బంపర్ సెక్షన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌, బ్రాండ్-న్యూ అల్లాయ్ వీల్స్‌ మొదలగునవి సరికొత్తగా రానున్నాయి. ఐదు-డోర్ల మహీంద్రా థార్ 300 మి.మీ పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుంది. సీటింగ్ మరింత సౌకర్యంగా ఉండనుంది. దీనిలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేశారు. ఇది 2.2L డీజిల్, 2.0L పెట్రోల్ ఇంజన్‌లతో శక్తిని పొందుతుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.






Advertisement

Next Story