నెలాఖరులోగా టాటా మోటార్స్ 'Tiago' ఈవీ!

by Harish |   ( Updated:2022-09-09 13:24:14.0  )
నెలాఖరులోగా టాటా మోటార్స్ Tiago ఈవీ!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈవీ విభాగంలో నెక్సాన్, టిగోర్ మోడళ్లతో మార్కెట్ లీడర్‌గా ఉన్న కంపెనీ ఈ నెలాఖరులోగా మరో ఈవీ కారును తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ టియాగోను మార్కెట్లో విడుదల చేయనున్నామని ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు పర్యావరణ అనుకూలమైన వాహనాలను అందించడమే సంస్థ లక్ష్యమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.

మరికొద్ది రోజుల్లో కొత్త ఈవీ టియాగో ధర, ఇతర ఫీచర్ల గురించి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే ఐదేళ్ల కాలంలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ క్రమంలోనే టియాగో ఈవీ ద్వారా పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తున్నట్టు కంపెనీ వివరించింది.

భారత్‌ను ప్రపంచ ఈవీ హబ్‌గా చూడాలనే భవిష్యత్తు లక్ష్యాలకు కంపెనీ కట్టుబడి ఉంటుంది. 2030 నాటికి 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌వే ఉండాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా టాటా మోటార్స్ ఈవీ విభాగం విస్తరిస్తుందని శైలేష్ చంద్ర వెల్లడించారు.

Also Read: Citroen సరికొత్త 'సీ5 ఎయిర్‌క్రాస్ ' ఎస్‌యూవీ మోడల్ లాంచ్

Advertisement

Next Story

Most Viewed