- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్-ఇన్-ఇండియా హెలికాప్టర్ల తయారీకి టాటా-ఎయిర్‌బస్ ఒప్పందం
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ కీలక ఒప్పందం చేసుకున్నాయని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. స్వదేశీ హెలికాప్టర్లను తయారు చేసేందుకు ఇరు కంపెనీలు ఈ భాగస్వామ్యం చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మక్రాన్ భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని వినయ్ క్వాత్రా చెప్పారు. దేశంలో హెచ్125 సింగిల్ ఇంజిన్ ఛాపర్‌ల ఉత్పత్తి కోసం ఇరు కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకోగా, భారత్, ఫ్రాన్స్ రక్షణ-పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌ను అంగీకరించాయి. ఈ మేడ్-ఇన్-ఇండియా హెలికాప్టర్లను వాణిజ్య అవసరాల కోసం తయారు చేయనున్నారు. టాటా గ్రూప్ అనుబంధ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్) ఈ హెలికాప్టర్ల అసెంబ్లింగ్ లైన్‌ను నిర్వహిస్తుంది. వీటిని మెడికల్ ఎయిర్‌లిఫ్ట్, నిఘా మిషన్లు, వీఐపీ, సందర్శనా అవసరాల కోసం వినియోగించనున్నారు. ఇప్పటికే టాటా, ఎయిర్‌బస్ సంస్థలు కలిసి 40 సీ295 రవాణా విమానాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వాణిజ్య హెలికాప్టర్లను తయారు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.