Tata Group: టాటా కేపిటల్ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం

by S Gopi |
Tata Group: టాటా కేపిటల్ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకు రానుంది. తాజాగా ఎప్పటినుంచో ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న టాటా కేపిటల్ పబ్లిక్ ఇష్యూకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా రూ. 1,504 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికోసం 23 కోట్ల షేర్లను ఇష్యూకు ఉంచనుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు టాటా కంపెనీ వెల్లడించింది. 2022లో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) టాటా కేపిటల్‌ను ఎన్‌బీఎఫ్‌సీ సంస్థగా ప్రకటించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ఏదైనా మూడేళ్లలోగా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవ్వాలి. దీంతో టాటా కేపిటల్ షేర్లను 2025, సెప్టెంబర్ నాటికి స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయాలి. ఈ కారణంగానే టాటా కేపిటల్ బోర్డు పబ్లిక్ సిహ్యూను ఆమోదించింది. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 93 శాతం వాటా ఉంది. కాగా, టాటా కేపిటల్ కార్యకలాపాలు 2007లో ప్రారంభమయ్యాయి. కంపెనీ వినియోగదారులకు హోమ్, పర్సనల్ లోన్లు ఇస్తుంది. దేశీయ ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో టాటా కేపిటల్ 2024, మార్చి నాటికి రూ. 1.57 లక్షల కోట్ల లోన్‌బుక్‌తో 7వ స్థానంలో ఉంది.

Next Story

Most Viewed