- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
SBI Home Loan Rates: హోమ్ లోన్ ఉందా? అయితే మీకే ఈ గుడ్‌న్యూస్.. EMI వడ్డీ రెట్లు ఇవాళ్టి నుంచే తగ్గుతున్నాయ్!

దిశ, వెబ్ డెస్క్ : SBI Home Loan Rates: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తమ హోంలోన్(Home Loan) వినియోగదారులకు శుభవార్త వినిపించింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్(Lending rate), రెపో లింక్డ్ లెండింగ్(Repo Linked Lending) రేట్లను తగ్గించింది. సవరించిన ఈ రేట్లు ఫిబ్రవరి 15వ తేదీ అనగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును 6.50శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్(MCLR), బీపీఎల్ఆర్ (BPLR)రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
హోంలోన్స్ (Home Loan)కు రెపోరేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని 2019 అక్టోబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అనుసరిస్తోంది. ఆర్బీఐ రెపోరేటు(RBI Repo Rate) మార్చినప్పుడల్లా ఈ రేటు మారుతుంది. తాజాగా ఈబీఎల్ఆర్ ను 9.15శాతం నుంచి 25బేసిస్ పాయింట్లు తగ్గించి 8.90 శాతానికి చేర్చింది. దీంతో ఈబీఎల్ఆర్ తో అనుసంధానం అయిన హోంలోన్స్, పర్సనల్ లోన్స్ , ఇతర రిటైల్ లోన్స్ పై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.
ఆర్బిఐ రెపో రేటు(RBI Repo Rate)కు అనుసంధానం అయిన ఆర్ఎల్ఎల్ఆర్(RLLR) కూడా 25బేసిస్ పాయింట్లను ఎస్బిఐ(SBI) తగ్గించి 8.50శాతానికి తగ్గించింది. దీంతో హోంలోన్స్, బిజినెస్ లోన్స్ ఆ మేరకు తగ్గనున్నాయి. ఈ రెండు రకాల వడ్డీ రేట్లను ఎస్బిఐ తగ్గించిన నేపథ్యంలో ఆయా లోన్స్ తీసుకున్నవారికి ప్రయోజనం కలుగుతుంది. ఈ మేర రుణ గ్రహీతలు ఈఎంఐ(EMI)లు గానీ, చెల్లించే కాలవ్యవధిని గానీ తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుంది.
మరిన్ని వివరాలకు మీ బ్యాంకును సంప్రదించి కావాల్సిన సమాచారం పొందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును సవరించిన నేపథ్యంలో ఇప్పటికే కెనరా బ్యాంక్(Canara Bank), పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank Of India), బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) రెపో ఆధారిత రుణ రేట్లనున 0.25శాతం మేర తగ్గించాయి.