- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో గ్లోబల్ సంస్థకు సీఈఓగా భారతీయ వ్యక్తి!
వాషింగ్టన్: అనేక అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తూ సత్తా చాటుతున్న భారతీయుల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా గ్లోబల్ దిగ్గజం, కాఫీ చెయిన్ సంస్థ స్టార్‌బక్స్‌కు సీఈఓగా భారత సంతతి వ్యక్తి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పెప్సికో కంపెనీలో పలు లీడర్‌షిప్ హోదాల్లో పనిచేసిన లక్ష్మణ్ నరసింహన్ అక్టోబర్ నుంచి స్టార్‌బక్స్‌లో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన యూకేకు చెందిన రెకిట్ కంపెనీకి సీఎఓగా పని చేస్తున్నారు. మూడేళ్లుగా ఈ కంపెనీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సెప్టెంబర్ 30న నిష్క్రమించనున్నారు. రెకిట్ కంపెనీ కంటే ముందు సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెప్సికోలో పలు విభాగాల్లో లక్ష్మణ్ నరసింహన్ పనిచేశారు. ఆయన పెప్సికోలో ఉన్న సమయంలోనే స్టార్‌బక్స్‌తో వివిధ సందర్భాల్లో ఒప్పందాలు జరిగాయి. ఇందులో కొన్ని ఒప్పందాలు నరసింహన్ పెప్సికో లాటిన్ అమెరికా సీఈఓగా ఉన్నప్పుడు చేసినవే.
అక్టోబర్‌లో చేరిన తర్వాత ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, వారి సంక్షేమం, వినియోగదారులకు అందించే సౌకర్యాలను మెరుగుపరచడం, రీ-ఇన్వెన్షన్ ప్లాన్ వంటి అంశాల గురించి అవగాహన ఏర్పరచుకున్నాక 2023, ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం స్టార్‌బక్స్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల అమెరికాలోని 200 కంటే ఎక్కువ స్టోర్లు గతేడాది యూనియన్‌గా మారి ఉద్యోగుల ప్రయోజనాలు, వేతనాల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కంపెనీ చాలామందిని ఇంటర్వ్యూ చేసిన అనంతరం నరసింహన్‌ను ఎంపిక చేసింది. ఆయనకున్న అనుభవం ద్వారా సంస్థ పునర్నిర్మాణం జరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
Also Read: 'డైనమో జాగ్రెబ్' జట్టులో తెలంగాణ ఫుట్‌బాల్ ప్లేయర్