Sony XR X90L : అదిరిపోయే పిక్చర్ క్వాలిటీతో Sony Ultra-HD స్మార్ట్ టీవీ

by Harish |   ( Updated:2023-06-26 13:54:53.0  )
Sony XR X90L : అదిరిపోయే పిక్చర్ క్వాలిటీతో Sony Ultra-HD స్మార్ట్ టీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: Sony కంపెనీ నుంచి కొత్తగా స్మార్ట్ టీవీ ఇండియాలో విడుదలైంది. దీని పేరు XR X90L. ప్రధానంగా ఈ సిరీస్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. ఇవి 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలుగా ఉన్నాయి. సోనీ కంపెనీ గతంలో లాంచ్ చేసిన X90K సిరీస్‌కు కొనసాగింపుగా ఈ టీవీలను తీసుకొచ్చారు.

ఈ కొత్త టీవీలలో Ultra-HD (3840x2160-పిక్సెల్) ఫుల్-అరే LED డిస్‌ప్లేలను అమర్చారు. ఇవి Android ద్వారా రన్ అవుతాయి. డాల్బీ అట్మాస్ సౌండ్, డాల్బీ విజన్ ఫార్మాట్‌ను కలిగి ఉన్నాయి. Google అసిస్టెంట్‌, Google Play స్టోర్ ద్వారా 10,000 యాప్‌లకు పైగా యాక్సెస్, మెరుగైన పిక్చర్ కోసం ఇమేజ్ ప్రాసెసింగ్, Apple AirPlay 2, Sony కాగ్నిటివ్ ప్రాసెసర్ XR, Sony PlayStation 5 గేమింగ్‌ మొదలగు ఫీచర్లు ఉన్నాయి.


55-అంగుళాల టీవీ ధర రూ.1,39,990. 65-అంగుళాల టీవీ ధర రూ. 1,79,990. ఈ రెండు స్మార్ట్ టీవీలు సోని కంపెనీ అధికారిక, ఆన్‌లైన్ స్టోర్‌లు, ఇతర ప్రధాన ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకానికి ఉన్నాయి. 75-అంగుళాల XR-75X90L టీవీని ఇంకా ప్రారంభించలేదు. ఇది త్వరలో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

దేశీయ వినియోగదారులు బాగా ఇష్టపడే సోనీ టీవీ విభాగంలో అత్యుత్తమైన టీవీలను తీసుకొచ్చినట్లు, అలాగే ఈ సిరీస్‌లో ప్రధానంగా మంచి డైనమిక్ రేంజ్ కంటెంట్‌కు సపోర్ట్ కోసం అల్ట్రా-HD స్క్రీన్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

Next Story