Shiv Nadar: ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా విడుదల.. మరోసారి శివ్ నాడార్ టాప్

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-07 13:37:12.0  )
Shiv Nadar: ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా విడుదల.. మరోసారి శివ్ నాడార్ టాప్
X

దిశ, వెబ్ డెస్క్: దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies) ఫౌండర్ శివ్ నాడార్(Shiv Nadar) దాతృత్వంలో మరోసారి మొదటి ప్లేస్ లో నిలిచారు. ఆయన సంపాదనలో అత్యధిక భాగం దాతృత్వ కార్యక్రమాల(Philanthropic Programs)కే ఖర్చు పెడుతున్నారు. ఎడెల్గీవ్ హురున్ ఇండియా(Edelgive Hurun India) దాతృత్వ జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో శివ్ నాడార్ రూ.2153 కోట్లు కోట్ల డొనేషన్లతో తొలి స్థానంలో నిలిచారు. ఈ లెక్కన చూసుకుంటే రోజుకు ఆయన రూ.5 కోట్లకు పైగా ప్రజలకు విరాళంగా అందిస్తున్నారు. గత సంవత్సరం ఆయన రూ. 2042 కోట్లను విరాళంగా ఇవ్వగా ఈ సారి 5 శాతం అధికంగా డొనేషన్స్ ఇచ్చారు. శివ్ నాడార్ దేశంలో విద్యా అభివృద్ధికే ఎక్కువగా విరాళాలను ఖర్చు చేస్తున్నారు. ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థలకి,విద్యా జ్ఞాన్, శివ్ నాడార్ యూనివర్సిటీ, శివ్ నాడార్ స్కూల్, శిక్షా ఇనీషియేటివ్, కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వంటి వాటికే శివ్ నాడార్ డొనేషన్స్ ఎక్కువగా ఉన్నాయి

ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో నిలవగా.. రూ. 352 కోట్లతో బజాజ్ ఫ్యామిలీ మూడో ప్లేస్ లో నిలిచింది. మరోవైపు కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదానీ రూ. 334 కోట్లు, రూ. 330 కోట్లతో వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.

ఎడెల్గీవ్ హురున్ ఇండియా టాప్-10 దాతృత్వ జాబితా ఇదే..

  • శివ్ నాడార్ - రూ. 2153 కోట్లు
  • ముకేశ్ అంబానీ - రూ. 407 కోట్లు
  • బజాజ్ ఫ్యామిలీ - రూ. 352 కోట్లు
  • కుమార మంగళం బిర్లా - రూ. 334 కోట్లు
  • గౌతమ్ అదానీ - రూ. 330 కోట్లు
  • నందన్ నీలేకని - రూ. 307 కోట్లు
  • కృష్ణ చివుకుల - రూ. 228 కోట్లు
  • అనిల్ అగార్వల్ - రూ. 181 కోట్లు
  • సుస్మిత, సుబ్రోతో బాగ్చి - రూ. 179 కోట్లు
  • రోహిణీ నీలేకని - రూ. 154 కోట్లు
Advertisement

Next Story

Most Viewed