- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Financial Year: జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరాన్ని లెక్కించాలని పన్ను నిపుణుల సూచన

దిశ, బిజినెస్ బ్యూరో: 2025 బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు 8వ బడ్జెట్, మోడీ 3.0 పాలనలో 2వ బడ్జెట్ కానుంది. ఈ నేపథ్యంలో పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారులు ప్రత్యక్ష పన్నులకు సంబంధించి అనేక అంచనాలతో ఎదురు చూస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ప్రస్తుత ద్వంద్వ పన్ను విధానంతో సవాళ్లను ఎదుర్కొంటున్నందున, మోడీ ప్రభుత్వం మధ్యతరగతిపై పన్ను భారాన్ని తగ్గించి, అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగిస్తుందని, పన్ను చెల్లింపు ప్రక్రియలను సులభతరం చేస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకా వివిధ వర్గాల నుంచి డిమాండ్లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొందరు నిపుణులు కేలండర్ ఏడాది ప్రారంభం రోజునే ఆర్థిక సంవత్సరం కూడా మొదలయ్యేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మనదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య ఉంటుంది. ఇతర దేశాలు కేలండర్ ఏడాదిని పరిగణలోకి తీసుకుని జనవరి 1 నుంచి డిసెంబర్ 31గా మార్చాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు అవసరమని చెబుతున్నారు. దీనివల్ల పాలనా సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా వ్యక్తులు, వ్యాపారులకు స్పష్టత ఉంటుందని భావిస్తున్నారు. ఎంఎన్‌సీ కంపెనీలు, ఎన్ఆర్ఐలకు ఇబ్బందులు ఉండవని, ఆర్థిక ప్రణాళికలకు అనువుగా ఉంటుందని అంటున్నారు. మరికొంతమంది నిపుణులు మాత్రం ఈ మార్పు కారణంగా ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తున్నారు. కొత్త పన్ను తేదీల విషయంలో పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు సర్దుబాటు కావడంలో సమస్యలు ఎదురవుతాయంటున్నారు. ఐటీ రిటర్నుల దాఖలులో సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు.