Stock Market: తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |   ( Updated:2024-08-15 15:40:59.0  )
Stock Market: తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. అంతకుముందు సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో బలహీనంగానే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఉదయం తక్కువ లాభాల మధ్య కదలాడిన మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత నుంచి పుంజుకున్నాయి. ముఖ్యంగా అమెరికాలో సీపీఐ డేటా విడుదల తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా కీలక ఐటీ షేర్లలో ర్యాలీ కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 149.85 పాయింట్లు లాభపడి 79,105 వద్ద, నిఫ్టీ 4.75 పాయింట్ల లాభంతో 24,143 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఆటో మినహా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఆల్ట్రా సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed

    null