తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన సూచీలు

by S Gopi |
తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతోంది. గతవారం వరుస సెషన్‌లలో లాభపడిన సూచీలు సోమవారం కూడా లాభాల్లోనే ముగిసింది. ఉదయం తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్‌కు ముందు నుంచి పుంజుకున్నాయి. తొలుత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడగా, ఆ తర్వాత కీలక ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం సహా ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్ల మద్దతుతో రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 131.18 పాయింట్లు లాభపడి 77,341 వద్ద, నిఫ్టీ 36.75 పాయింట్ల లాభంతో 23,537 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.48 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed