SEBI: మాధవి బుచ్, ఇతర అధికారులపై కేసు వ్యవహారాన్ని సవాలు చేయనున్న సెబీ

by S Gopi |
SEBI: మాధవి బుచ్, ఇతర అధికారులపై కేసు వ్యవహారాన్ని సవాలు చేయనున్న సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, నియంత్రణాపరమైన ఉల్లంఘనలకు సంబంధించి మాజీ ఛైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్, ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న ముంబై స్పెషల్ కోర్టు ఆదేశాలపై సెబీ స్పందించింది. దీనిపై కోర్టులో సవాలు చేస్తామని, త్వరలో చట్టపరమైన చర్యలను ప్రారంభించనున్నట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. ముంబై కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి ఆరోపణలు నిష్ప్రయోజనమైనవని స్పష్టం చేసింది. సదరు పిటిషనర్ ఇదివరకు పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టు వాటిని కొట్టివేసిందని, కొన్ని సందర్భాల్లో కోర్టు ఖర్చులు కూడా విధించిందని సెబీ తెలిపింది. తాజా పిటిషన్‌పై సవాలు చేస్తూ చట్టపరంగానే ముందుకెళ్తామని, అన్ని విషయాలపై నియంత్రణాపరమైన అనుమతులకు కట్టుబడి ఉండనున్నట్టు సెబీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన అధికారులు సంబంధిత సమయంలో వారు అక్కడ లేనప్పటికీ, కోర్టు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, వాస్తవాలను పరిశీలించకుండా, సెబీకి అవకాశం ఇవ్వకుండా పిటిషనర్ దరఖాస్తును అనుమతించిందని సెబీ తన ప్రకటనలో వివరించింది.

Advertisement
Next Story