- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Samsung: గెలాక్సీ ఎస్24 ఫ్యాన్ ఎడిషన్‌ను విడుదల చేసిన శాంసంగ్
దిశ, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఎస్24 సిరీస్‌లో సరికొత్త ఫ్యాష్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రూ. 59,999 ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ప్రీమియం సెగ్మెంట్ ఎస్ సిరీస్ మోడళ్లకు కొనసాగింపుగా లాంచ్ చేసింది. ఎస్24 సిరీస్ ఫోన్‌ల కంటే గెలాక్సీ ఎస్24 ఫ్యాన్ ఎడిషన్(ఎఫ్ఈ) తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్లను అందించడం విశేషం. మూడు వేరియంట్లలో విడుదలైన ఎస్24 ఎఫ్ఈ 8జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. స్టోరేజ్‌కు సంబంధించి 128జీబీ, 256జీబీ, 512జీబీ ఆప్షన్‌లలో వస్తుంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయని, వచ్చే నెల 3వ తేదీ నుంచి రిటైల్ అమ్మకాలు మొదలవనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి 128జీబీ ధర రూ. 59,999, 256జీబీ రూ. 65,999 ఉంటుందని ప్రకటించిన శాంసంగ్, 512జీబీ వేరియంట్ ధరపై స్పష్టత ఇవ్వలేదు. ఫీచర్లకు సంబంధించి గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో ఎగ్జినోస్ 2400 సిరీస్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.