- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Samsung: గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లు ప్రకటించిన శాంసంగ్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మొబైల్‌ఫోన్ తయారీ బ్రాండ్ శాంసంగ్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 22న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ కార్యక్రమంలో తన కొత్త గెలాక్సీ ఫోన్‌ల విడుదలకు ముందు శాంసంగ్ ఈ ఆఫర్‌లను ప్రకటించడం విశేషం. ఇందులో భాగంగా శాంసంగ్ ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తక్షణ క్యాష్‌బ్యాక్‌తో పాటు గెలాక్సీ జీ ఫోల్డ్ 6, జీ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌ల కోసం 24 నెలలకు వడ్డీ రహిత ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. అదనంగా జీ ఫోల్డ్ 6, జీ ఫ్లిప్ 6 కొనుగోలు చేసే కస్టమర్లకు గెలాక్సీ వాచ్ ఆల్ట్రాపై రూ. 18,000 తగ్గింపు, గెలాక్సీ బడ్స్ 3 ప్రోపై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే, జీ ఫోల్డ్ 6 మోడల్ ధర రూ. 1,64,999 ఉండగా, దీనిపై రూ. 15 వేల క్యాష్‌బ్యాక్ కంపెనీ ఆఫర్ చేస్తోంది. గెలాక్సీ జీ ఫ్లిప్6 ధర రూ. 1,09,999 ఉండగా, రూ. 20 వేల డిస్కౌట్ ఇస్తోంది. అలాగే, కొత్తగా విడుదల కానున్న గెలాక్సీ ఎస్25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రీ-రిజర్వ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఎస్25 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ముందస్తు యాక్సెస్ కోసం రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ కొనే సమయంలో రూ. 5,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా ప్రీ-రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు ప్రత్యేక ఎడిషన్ మోడల్, ప్రత్యేక కలర్ ఆప్షన్‌లను కొనే అవకాశం ఉంటుందని కపెనీ పేర్కొంది.