- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Rupee: కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలుపొందడంతో ఆసియా కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే భారత కరెన్సీ రూపాయి సోమవారం మరోసారి ఆల్‌టైమ్ కనిష్టం రూ. 84.38కి చేరింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జోక్యం ద్వారా రూపాయి మరింత పతనం కాకుండా చూడాలని మదుపర్లు ఆశిస్తున్నారు. రూపాయితో పాటు చైనా యువాన్ సహా పలు ఆసియా కరెన్సీలు కూడా క్షీణిస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అమెరికా సుంకాలను మరింత పెంచుతుందనే ఆందోళనలు పెరిగిన నేపథ్యంలోనే చైనా యువాన్‌తో పాటు రూపాయి బలహీనపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. యువాన్ కరెన్సీ బలహీనతతో చైనా వస్తువులు మరింత చౌకగా మారడం వల్ల భారత వాణిజ్య లోటు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కరెన్సీలు 0.1 శాతం నుంచి 0.4 శాతం బలహీనపడ్డాయి. ట్రంప్ 2.0 హయాంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 8-10 శాతం క్షీణించవచ్చని ఎస్‌బీఐ పరిశోధనా విభాగం అభిప్రాయపడింది. ట్రంప్ విజయంతో భారత్‌కు అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఉండనున్నాయి. హెచ్1బీ బీసా పరిమితులు, డాలర్ బలపడటం వంటి అంశాలతో స్వల్పకాలానికి రూపాయి కొంత అస్థిరతను కలిగి ఉండచ్చని నివేదిక పేర్కొంది.