ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల డివిడెండ్ ఇవ్వనున్న ఆర్‌బీఐ

by S Gopi |
ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల డివిడెండ్ ఇవ్వనున్న ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రభుత్వానికి సుమారు రూ. లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ అంచనా గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ. 87,400 కోట్ల కంటే పెరిగిందని, కాబట్టి 2024-24లో ఆర్‌బీఐ ఎక్కువ డివిడెండ్ ప్రభుత్వానికి ఇవ్వనుందని నివేదిక అభిప్రాయపడింది. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో ఎక్కువ భాగం, దాదాపు 70 శాతం విదేశీ కరెన్సీ ఆస్తులు, మరో 20 శాతం దేశీయ ప్రభుత్వ బాండ్లలో ఉన్నాయి. ఈ సెక్యూరిటీల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం రూ. 1.5-1.7 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అదనంగా, లిక్విడిటీ కార్యకలాపాల నుంచి వచ్చే వడ్డీ ఆర్‌బీఐ ఆదాయాన్ని పెంచింది. ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి 2024-25కి రూ. 1,02,000 లక్షల కోట్ల డివిడెండ్ వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం అంచనా రూ. 1,04,400 కోట్ల కంటే స్వల్పంగా తగ్గింది. కాబట్టి దాదాపు అంచనాలకు తగిన స్థాయిలో ప్రభుత్వం డివిడెండ్ పొందవచ్చని అంచనా వేస్తున్నామని' యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed