- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంక్ వినియోగదారులకు RBI గుడ్ న్యూస్.. బ్యాంకులకు కీలక ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం వేళ బ్యాంక్ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్వీట్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని మినిమం బ్యాలెన్స్ నిల్వలపై కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకుండా, అసలు లావాదేవీలు జరపని ఖాతాలపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూల్ చేయవద్దని ఆర్బీఐ ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు, విద్యార్థుల స్కాలర్ షిష్ ఖాతాలు రెండేళ్లుగా వాడనప్పటికీ.. వాటిని నిరూపయోగ ఎకౌంట్లుగా గుర్తించకుండా, మినిమం బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఎలాంటి ఫైన్ విధించకూడదని సూచించింది. ఈ మేరకు ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ రూల్ అమలు చేయాలని ఆదేశించింది. కాగా, ప్రస్తుతం జీరో బ్యాలెన్స్ ఎకౌంట్లు కాకుండా మిగిలిన బ్యాంక్ ఎకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్స్ చేయకపోతే బ్యాంకులు ఫైన్ విధిస్తున్నాయి. దీంతో అన్ క్లైయిమ్డ్ డిజిపాట్లు పెరిగిపోతున్నాయి. ఈ అన్ క్లైయిమ్డ్ డిజిపాట్లను తగ్గించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Read More..