- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏప్రిల్ 1న రూ.2 వేల నోట్ల మార్పిడి,డిపాజిట్‌ను నిలిపివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు సంబంధించి గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 19 కార్యాలయాల్లో 2024, ఏప్రిల్ 1న పెద్ద నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ చేయడాన్ని నిలిపేస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ కార్యకలాపాల వల్ల తాత్కాలికంగా ఈ ప్రక్రియ అందుబాటులో ఉండదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 2(మంగళవారం) నుంచి యథావిధిగా రూ. 2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. గతేడాది మే 19న ఆర్‌బీఐ చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి దాదాపు 97.62 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంకా రూ. 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉందని పేర్కొంది. పెద్ద నోట్లను కలిగి ఉన్నవారు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో వాటిని డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవచ్చు. పోస్ట్ ఆఫీసు ఖాతా వివరాల ద్వారా దేశవ్యాప్తంగా ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్‌బీఐ కార్యాలయానికి పోస్ట్ ద్వారా కూడా నోట్లను పంపించే వెసులుబాటును సెంట్రల్ బ్యాంకు కల్పించింది.