రతన్ టాటాకు అరుదైన పురస్కారం!

by Hamsa |   ( Updated:2023-04-25 11:20:05.0  )
రతన్ టాటాకు అరుదైన పురస్కారం!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద గ్రూప్ సంస్థ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్, పారిశ్రామికవేత్త రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లభించింది. భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలకు ఆయన చేసిన సేవకు గానూ ఈ పురస్కారం లభించింది. దీనికి సంబంధించి భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ'ఫరెల్ వెల్లడించారు. రతన్ టాటా వ్యాపారంలో మాత్రమే కాకుండా దాతృత్వంలోనూ గొప్ప వ్యక్తిగా నిలిచారని, ఆయన సహకారం ఆస్ట్రేలియాకు ఎంతో లాభించిందన్నారు.

భారత్-ఆస్ట్రేలియా బంధానికి రతన్ టాటా సుదీర్ఘకాలంగా చేసిన కృషికి, నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ప్రదానం చేయడం సంతోషంగా ఉందని వివరించారు. ఈ సందర్భంగా టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూష ఎగ్జిక్యూటివ్ రాహూల్ రంజన్, టాటా వ్యాపారం, దాతృత్వంలోని సేవల ద్వారా భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందారు. ఆయన ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

Also Read..

కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫ్రాంక్స్' కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!


Advertisement

Next Story