- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Govt Scheme: గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ.5000 ఇచ్చే పథకం ఇదే.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
![Govt Scheme: గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ.5000 ఇచ్చే పథకం ఇదే.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Govt Scheme: గర్భిణీలకు గుడ్ న్యూస్.. రూ.5000 ఇచ్చే పథకం ఇదే.. ఇలా దరఖాస్తు చేసుకోండి!](https://www.dishadaily.com/h-upload/2025/01/30/416347-jpeg-optimizerpradhan-mantri-matru-vandana-yojana-1.webp)
దిశ, వెబ్‌డెస్క్: Govt Scheme: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ (pm modi) మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలన్న లక్ష్యంతోనే అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా మహిళలకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన(Pradhan Mantri Matru Vandana Yojana) ద్వారా మహిళల ఆరోగ్యంతోపాటు పోషకాహారాన్ని మెరుగుపరచడానికి వారి జీవన నాణ్యతను మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ పథకం ప్రధాన లక్ష్యం గర్బిణీ స్త్రీల(pregnant women)కు పోషకాహారం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, తద్వారా వారు శిశువు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడంతోపాటు వారి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ తీసుకునేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ స్కీం మొదటి బిడ్డకు మాత్రమే కాకుండా రెండవ బిడ్డకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఈ స్కీము ద్వారా ఎక్కువ మంది మహిళలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. గర్భిణీలు గర్భం దాల్చిన తర్వాత వారి పౌష్టికాహార సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వారికి రూ. 5000 అందిస్తుంది.
ఈ స్కీము ప్రయోజనాలను పొందేందుకు ..మహిళలకు సమీపంలోని అంగన్ వాడీ కేంద్రా(Anganwadi Center)న్ని సంప్రదించవచ్చు. అక్కడ అంగన్ వాడీ కార్యకర్తలు వారికి సహాయం అందిస్తారు. ఇంతకు ముందు ఈ స్కీమును వైద్యారోగ్య శాఖ నిర్వహించేది. ఇప్పుడు ఇతర శాఖలు అమలు చేయడంతోపాటు దాని పరిధి, ప్రభావాన్ని కూడా పెంచింది. ఈ స్కీముకు సంబంధించిన యాప్ ద్వారా అంగన్ వాడీ కార్యకర్తలకు బాధ్యతలను అప్పగించారు. తద్వారా మహిళలు సరైన సమయంలో సహాయం పొందగలరని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతోపాటు మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్శించేందుకు కేంద్రం ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీము(Mahila Samman Savings Certificate Scheme)ను కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. మహిళలు చేసిన పెట్టుబడులపై ఆకర్షణీయమైన రాబడిని కూడా అందిస్తోంది. కేంద్ర బడ్జెట్ 2023లో భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీము మహిళలకు ఎంతో భరోసాను కల్పిస్తోంది.
ఈ స్కీము ద్వారా మహిళలు లేదా బాలికల పేరుతో రెండేళ్ల పాటు రూ. 2లక్షలు అందిస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ కూడా చెల్లిస్తున్నారు. ఈ స్కీము పోస్టాఫీసుతోపాటు అనేక బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. 2023లో ప్రారంభించిన ఈ స్కీము 2ఏళ్లపాటు అంటే మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది. మహిళలే పెట్టుబడి దారులే లక్ష్యంగా ఈ స్కీమును తీసుకువచ్చింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 7.5శాతం స్థిర వడ్డీ అందుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తం వారి అకౌంట్లో జమ అవుతుంది.