- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే గ్రీన్ ఎనర్జీ తప్పనిసరి!
న్యూఢిల్లీ: కొత్తగా థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను వెల్లడించింది. అందులో భాగంగా కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలో అందులో కనీసం 40 శాతానికి సమానమైన పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసింది. లేదా ఆ మొత్తానికి సమానమైన పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ నిబంధన 2023, ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఏర్పాటు చేయబోయే బొగ్గు, లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు వర్తిస్తుంది. దీనికోసం మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003లో ఉన్న టారిఫ్ పాలసీ 2016ని సవరించింది. థర్మల్ ప్లాంటులో పునరుత్పాదక ఇంధన కేంద్రం ఏర్పాటు లేదా 40 శాతానికి సమానమైన గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసి సరఫరా చేయాలని ఇంధన శాఖ తెలిపింది. 2025, మార్చి 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కానీ, సొంతంగా బొగ్గు గనులు ఉన్న విద్యుదుత్పత్తి కంపెనీలకు ఈ నిబంధన వర్తించదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.