స్టాక్ ఎక్స్ఛేంజీలోకి ITC హోటల్స్..!

by Harish |
స్టాక్ ఎక్స్ఛేంజీలోకి ITC హోటల్స్..!
X

ముంబై: ఐటీసీకి చెందిన హోటళ్లను త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు సంబంధిత వ్యక్తులు ప్రముఖ మీడియాకు వెల్లడించారు. ఆగస్టు 14న జరగనున్న బోర్డు సమావేశంలో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలను అనుసరించి స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ కానున్నట్లు జులై 24న ఒక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చడానికి దాదాపు ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టనుంది.

ఆగస్టు 14న జరిగే మీటింగ్‌లో విభాగాల వారీగా రాబడి, ఆస్తులు, స్టాండ్‌లోన్ ఆదాయం మొదలగు వాటిని పరిగణలోకి తీసుకుని లిస్టింగ్ గురించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో బోర్డు సభ్యులు ఉన్నారు. ఐటీసీ తన హోటల్స్ వ్యాపార విభజనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతిపాదిత పునర్నిర్మాణం వేగంగా విస్తరిస్తున్న హోటల్ వ్యాపారంలో సరైన మూలధనంతో మరిన్ని పెట్డుబడులను సాధించడానికి ఇది మరింత ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీసీ దాని పోర్ట్‌ఫోలియోలో 120 కి పైగా హోటల్స్‌ను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed