- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కస్టడీ పొడిగింపు!
X
ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకులో రూ. 538 కోట్ల మోసం కేసులో అరెస్ట్ అయిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కస్టడీని ఈడీ పొడిగించింది. 10 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నరేశ్ గోయల్‌ను కోర్టులో హాజరుపరిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 14 వరకు కస్టడీని పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
కెనరా బ్యాంక్ మోసం కేసులో నరేశ్ గోయల్‌తో పాటు ఆయన భార్య అనిత, పలువురు కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్‌కు రూ. 848.86 కోట్ల క్రెడిట్, రుణాలను మంజూరు చేసినట్టు, అందులో రూ. 538.62 కోట్ల బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంక్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story