బ్యాటరీల తయారీ కోసం ఇండియన్ ఆయిల్‌తో పానసోనిక్ జాయింట్ వెంచర్

by S Gopi |
బ్యాటరీల తయారీ కోసం ఇండియన్ ఆయిల్‌తో పానసోనిక్ జాయింట్ వెంచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన పానసోనిక్ గ్రూప్ దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సిలిండ్రికల్ లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ కోసం ఇరు సంస్థలు కలిసి సంయుక్తంగా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికోసం పానసోనిక్ బైండింగ్ టర్మ్ షీట్‌పై సంతకం చేసి, ఐఓసీఎల్‌తో చర్చలు ప్రారంభించింది. భారత మార్కెట్లో టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలు, ఇంధన నిల్వల కోసం బ్యాటరీలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. సిలిండ్రికల్ లిథియం-అయాన్ బ్యాటరీలను సాధారణంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పవర్ టూల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తారు. ఇప్పటివరకు పానసోనిక్ ఆటోమోటివ్ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసింది. భారత్‌లో క్లీన్ ఎనర్జీ పురోగతిని సులభతరం చేసేందుకు బ్యాటరీ టెక్నాలజీ సాధ్యాసాధ్యాలపై ఇరు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ ఏడాది వేసవి ముగిసే సమయానికి ఇరు సంస్థలు ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా చర్చిస్తున్నాయి. ఈ ఒప్పందంతో సెల్ టెక్నాలజీని మెరుగుపరచడమే కాకుండా, ముడి పదార్థాలు, దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు భారత బ్యాటరీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని ఐఓసీఎల్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed