- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెలివరీ సేవల కోసం మార్కెట్లోకి కొత్తగా ఈ-స్కూటర్ విడుదల
హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ తన కమర్షియల్, డెలివరీల కోసం వినియోగించే ఈవీ స్కూటర్ 'క్వాంటమ్ బిజినెస్ ' కొత్త వేరియంట్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 99,000 గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. సరికొత్త క్వాంటమ్ బిజినెస్ స్కూటర్ లాస్ట్ మైల్ డెలివరీ కంపెనీల సౌకర్యాల కోసం 1200 వాట్ల పనితీరు కలిగిన మోటారుతో గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కేవలం 8 సెకన్లలో 0-40 కిలోమీటర్ల స్పీడ్‌ను చేరుకుంటుందని కంపెనీ వెల్లడించింది.
తమ ఈవీ స్కూటర్ల కొనుగోలు ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు క్వాంటమ్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, మరికొన్ని ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం చేసుకున్నట్టు వివరించింది. ఈ సరికొత్త స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అదేవిధంగా రిమోట్ లాక్-అన్‌లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ ఛార్జర్, డిస్క్ బ్రేకులు, ఎల్‌సిడి డిస్‌ప్లే, లోడ్ క్యారీయింగ్ సహా మరెన్నో ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.
దేశవ్యాప్తంగా చాలామంది చిన్న వ్యాపారులు తమ సరుకులను రవాణా చేసేందుకు ఎక్కువగా ద్విచక్ర వాహనాలపైనే ఇప్పటికీ ఆధారపడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన టెక్నాలజీతో, సౌకర్యవంతమైన ఈవీ స్కూటర్‌ను అందించాలనే లక్ష్యంతో 'క్వాంటమ్ బిజినెస్ ' ఈ-స్కూటర్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ డైరెక్టర్ చేతన చుక్కపల్లి చెప్పారు. క్వాంటం బిజినెస్ స్కూటర్ 3 ఏళ్లు లేదా 90 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తుందని కంపెనీ పేర్కొంది.