- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కొత్తగా 150 బోయింగ్ విమానాలు ఆర్డర్ చేసిన ఆకాశ ఎయిర్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంలో కొత్తగా వచ్చిన 'ఆకాశ ఎయిర్ ' తన సేవలను విస్తరించే ప్రణాళికలను అమలు చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ చేసింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ రూట్లలో సేవలందించేందుకు ఈ విమానాలను వినియోగిస్తామని, మ్యాక్స్ 10, మ్యాక్స్ 8-200 మోడల్ విమానాల కోసం ఆర్డర్ చేసినట్టు హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా కార్యక్రమంలో ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదివరకు కంపెనీ 2021లో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను బుక్ చేయగా, అందులో 22 విమానాలను డెలివరీ తీసుకుంది. గతేడాది కూడా మరో నాలుగు విమానాలను ఆర్డర్ చేసింది. దీంతో తాజా ఆర్డర్‌తో కంపెనీ మొత్తం విమానాల సంఖ్య 226కు చేరుకోనుంది. వీటిని వచ్చే ఎనిమిదేళ్ల కాలంలో డెలివరీ అందుకోనుంది. ప్రస్తుతం భారత విమానయాన రంగంలో ఇండిగో (60 శాతం), టాటా (26 శాతం)తో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, అకాశ ఎయిర్ 4 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. త్వరలో అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించనుంది. దీనికోసం ఇప్పటికే అనుమతులను కూడా కంపెనీ పొందింది.