- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 శాతం పెరిగిన ఎన్‌బీఎఫ్‌సీ రుణాలు.. గోల్డ్ లోన్‌లే అత్యధికం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ) రుణాలు 12 శాతం పెరిగాయి. ప్రధానంగా హోమ్, ఆటో లోన్‌ల విభాగంలో వృద్ధి కారణంగా పెరుగుదల నమోదైంది. ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎఫ్ఐడీసీ) తాజా డేటా ప్రకారం.. సమీక్షించిన ఏప్రిల్-జూన్ మధ్య దేశీయ ఎన్‌బీఎఫ్‌సీలు రూ. 5.08 లక్షల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 4.54 లక్షల కోట్లను ఇచ్చాయి. రుణాలిచ్చిన మొత్తంలో గోల్డ్ లోన్‌లు రూ. 79,217 కోట్లతో 26 శాతం పెరిగాయి. ఇతర విభాగాల కంటే ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు ఎక్కువగా గోల్డ్ లోన్లు ఇచ్చాయి. వ్యక్తిగత రుణాలు 12 శాతం వృద్ధితో రూ. 71,306 కోట్లకు పెరిగాయి. హోమ్ లోన్ విభాగంలో రూ. 50,826 కోట్లు, ఆటో విభాగంలో రూ. 25,022 కోట్ల విలువైన రుణాలను ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చాయి. కన్స్యూమర్ విభాగంలో రూ. 34,466 కోట్ల లోన్‌లను మంజూరు చేశాయి. సీజన్ కాకపోయినప్పటికీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హౌసింగ్, ఆటో రుణాలు పెరగడంతో ఎన్‌బీఎఫ్‌సీ పరిశ్రమకు అత్యంత సానుకూల పరిణామమని ఎఫ్ఐడీసీ కో-ఛైర్మన్ కె వి శ్రీనివాసన్ పేర్కొన్నారు.