- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mutual Funds: ఆ మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు రూ. 10వేలు పొదుపు చేస్తే చేతికి రూ. 2కోట్లు..మీ దశ తిరిగినట్లే

దిశ, వెబ్ డెస్క్ : Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను అందుకునే వీలుంటుంది. అందుకే చాలా మంది వీటిని ఎంచుకుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని ఆశిస్తుంటారు. ఇప్పుడు అలాగే ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించిన ఒక మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రూ. 10వేల సిప్ ను కోట్ల రూపాయలుగా మార్చింది.
పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారని చెప్పవచ్చు. ఇక్కడ రిస్క్ స్థాయి ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా..కాలం గడుస్తున్నా కొద్దీ సంపద పెరుగుతూ పోతుందని నిపుణులు చెబుతుంటారు. ఇతర పెట్టుబడి పథకాలు, బ్యాంక్ ఫిక్డ్స్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ ఇక్కడ రిటర్న్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ లో కాస్త రిటర్న్స్ ఎక్కువగానే పొందవచ్చు. ఇక్కడ రిస్క్ తీసుకోవాలంటే స్టాక్ మార్కెట్లు కూడా ఉన్నప్పటికీ..స్టాక్ మార్కెట్ల కంటే కాస్త తక్కువ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో నేరుగా మనం ఇక్కడ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టము. ఇక్కడ మన డబ్బులను వేర్వేరు స్టాక్స్ లో సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీంతో వైవిధ్యతతో మంచి లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మంచి రిటర్న్స్ ఇచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
అదే సుందరం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. ఇది అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ రకానికి చెందింది. ఇటీవల జనవరి 14తో 25ఏళ్ల పూర్తి చేసుకుంది. ఇది ఓపెన్ ఎండెడ్ హైబ్రిడ్ స్కీమ్. ఎక్కువగా ఈక్విటీ రిలేటెడ్ సెక్యూరిటీలు, ఫిక్స్డ్ ఇన్ కం సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది.
ఈ స్కీమ్ లాంఛింగ్ దగ్గర నుంచి చూస్తే సగటున 11.37 శాతం చొప్పున రిటర్న్స్ అందించింది. గత 10ఏళ్లలో చూస్తే ఈ స్కీమ్ 11.18శాతం చొప్పున రాబడి అందించింది. గత 5ఏళ్లలో అయితే రాబడి శాతం 13. 85శాతంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ స్కీము ప్రారంభమైనప్పటి నుంచి నెలకు రూ. 10వేల చొప్పున సిప్ చేసిన వారికి ఏకంగా 13.17శాతం రాబడితో చేతికి రూ. 2.05కోట్లు వచ్చాయి. ఇదే గత 10ఏళ్ల కాలంలో చూస్తే రూ. 10వేల సిప్ తో చేతికి రూ. 22.66లక్షలు వచ్చాయి. ఇక్కడ రాబడి శాతం 12.23గా ఉంది.
మరోవైపు లంప్ సమ్ ఇన్వెస్ట్ మెంట్ అంటే ఏకకాలంలో ఒకేసారి రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ 25ఏళ్లలో చూస్తే 11.37శాతం రాబడి చొప్పున చేతికి రూ. 14.88లక్షలు వచ్చాయి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ స్కీమ్ తన పోర్ట్ ఫోలియోలో 69స్టాక్స్ ను కలిగి ఉంది. ఈ స్కీమ్ మేనేజర్లుగా రవి గోపాలక్రుష్ణన్, ఎస్. భరత్, సందీప్ అగర్వాల్, ద్విజేంద్ర శ్రీవాత్సవ ఉన్నారు. పెట్టుబడుల విషయానికి వస్తే 70.15శాతం వాటాను ఈక్విటీల్లో పెట్టింది.