- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాల్లో ముత్తూట్ మైక్రోఫిన్ విస్తరణ
దిశ, బిజినెస్ బ్యూరో: కేరళకు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ మైక్రోఫిన్ తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఇప్పటికే తెలంగాణలో అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనూ అడుగుపెట్టనున్నట్టు తెలిపింది. చిన్న వ్యాపారాలను నిర్వహించే మహిళలకు సూక్ష్మ రుణాల రూపంలో ఆర్థిక సాయం అందించడంపై దృష్టి సారించే కంపెనీ, ఈ నెలలో తెలంగాణలోని హన్మకొండ, జనగాం, భువనగిరి, పరకాలలో నాలుగు బ్రాంచ్‌లను ప్రారంభిస్తామని శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. 'తమ నెట్‌వర్క్‌ను పెంచడంతో పాటు కొత్త వినియోగదారులను సంపాదించాలని భావిస్తున్నాం. కంపెనీ వృద్ధిని పెంచేందుకు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాం. త్వరలో ఏపీలోనూ బ్రాంచులను ఏర్పాటు చేస్తామని' ముత్తూట్ మైక్రోఫిన్ సీఈఓ సదాఫ్ సయీద్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 1,424 బ్రాంచులను నిర్వహిస్తోంది. 32.80 లక్షల యాక్టివ్ కస్టమర్లతో సేవలందిస్తోంది. ముత్తూట్ అప్పాచాన్ గ్రూప్‌లో భాగమైన ముత్తూట్ మైక్రోఫిన్ కూరగాయల విక్రయాలు, టీ షాప్ వంటి చిన్న వ్యాపారాలను నిర్వహించే మహిళలకు రుణాలిస్తుంది.