ఇకపై కార్లతో కూడా మాట్లాడొచ్చు.. మెర్సిడెస్-బెంజ్ కొత్త ఫీచర్

by Harish |   ( Updated:2023-06-16 12:28:47.0  )
ఇకపై కార్లతో కూడా మాట్లాడొచ్చు.. మెర్సిడెస్-బెంజ్ కొత్త ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వచ్చినప్పటి నుంచి ఇదొక సంచలనంగా మారింది. దాదాపు అన్ని రంగాల్లో కూడా AI ఆధారిత సిస్టంను ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వార్తల్లోకి ఎక్కిన ChatGPT ని దాదాపు అన్ని విభాగాల్లోకి తీసుకువస్తున్నారు. తాజాగా AI(కృత్రిమ మేధస్సు) ని వాహనాల్లో కూడా తీసుకురావాలని కొన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

దీంట్లో భాగంగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ తన కార్లలో ChatGPT ని ప్రవేశ పెట్టాలని చూస్తుంది. దీంతో డ్రైవర్లు కారుతో మాట్లాతారు. డ్రైవర్లు "హే మెర్సిడెస్" అని అనడం ద్వారా వివిధ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. గమ్యస్థాన వివరాలు, వెళ్లాల్సిన ప్లేస్ ఎంత దూరం ఉంది, వాతావరణ అప్‌డేట్‌లు, స్ప్టోర్ట్స్ అప్‌డేట్‌లు, పరిసరాల గురించిన ప్రశ్నలకు సమాధానాలు AI చెప్తుంది. వాయిస్ కమాండ్‌లను ఇవ్వడం ద్వారా సహజమైన సంభాషణలను నిర్వహిస్తుందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతానికి దీనిని టెస్టింగ్ చేస్తున్నారు. అమెరికాలో "MBUX" సిస్టమ్‌లను కలిగి ఉన్న దాదాపు 9,00,000 వాహనాల్లో జూన్ 16 నుంచి ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నారు. ఈ పరీక్ష మూడు నెలల పాటు కొనసాగుతుంది. పనితీరు ఆధారంగా డ్రైవర్లు ఇచ్చిన సూచనల ప్రకారం, మరిన్ని చర్యలు తీసుకుని మిగతా వాహనాల్లో కూడా ఈ ఫీచర్‌ను తీసుకువస్తామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed