2,000 మందిని తొలగించనున్న మెకిన్సీ!

by Vinod kumar |
2,000 మందిని తొలగించనున్న మెకిన్సీ!
X

వాషింగ్టన్: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులకు ఇప్పట్లో అంతం కనిపించేలా లేదు. తాజాగా ఇతర కంపెనీలకే ఉద్యోగుల విషయమై సలహాలిచ్చే గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ కూడా వేలాది మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సుమారు 2,000 మందిని ఇంటికి సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ క్లయింట్లతో నేరుగా సంబంధం లేని సహాయక సిబ్బందిని తొలగించాలని భావిస్తున్నట్టు మెకిన్సీ ఉద్యోగులు పేర్కొన్నారు.

గడిచిన పదేళ్లకు పైగా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుతం ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న కారణంగా ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని, ఈ ప్రక్రియకు సంబంధించి రాబోయే రెండు మూడు వారాల్లో అధికారికంగా ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం కంపెనీలో 45 వేల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 2 వేలమందిని తీసేయాలని భావిస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఫైనాన్స్, టెక్నాలజీ, రిటైల్ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం అవనున్నారు.

Advertisement

Next Story

Most Viewed