- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్ వాటాలో వెనకబడ్డ మారుతి, హ్యూండాయ్!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలో దిగ్గజాలు మారుతి సుజుకి, హూండాయ్ మోటార్ కంపెనీలు రిటైల్ అమ్మకాల్లో వెనకబడ్డాయని డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా కంపెనీలు అంతకుముందు తో పోలిస్తే 2022-23లో మార్కెట్ వాటాను కోల్పోయాయి. ఇదే సమయంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియాలు మార్కెట్ వాటాను పెంచుకున్నాయి.
ఫాడా తెలిపిన వివరాల ప్రకారం, అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల సంస్థ మారుతి సుజుకి గత ఆర్థిక సంవత్సరంలో 14.80 లక్షల యూనిట్లతో 40.86 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఇది అంతకుముందు 2021-22 కంటే 1.27 శాతం తగ్గింది. హ్యూండాయ్ సైతం 1.77 శాతం వాటా కోల్పోయింది. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 శాతం నుంచి 13.39 శాతానికి పెరిగింది. ఎం అండ్ ఎం 6.77 శాతం నుంచి 8.94 శాతానికి పెంచుకుంది. కియా 5.3 శాతం నుంచి 6.42 శాతానికి వృద్ధి చెందింది.