- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
L&T Chairman: ఎల్అండ్‌టీ ఛైర్మన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ, బిజినెస్ బ్యూరో: మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీ ఛైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎంతసేపనీ భార్యనే చూస్తూ ఉంటారు, ఆదివారం కూడా ఉద్యోగం చేయాలన్నారు. తాజాగా నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ.. సంక్షేమ పథకాల కారణంగా వారు ఎక్కడికి వలస వెళ్లడంలేదని, పని చేసేందుకు ఇష్టపడటంలేదన్నారు. బుధవారం చెన్నైలో జరిగిన పరిశ్రమ సంఘం సీఐఐ సదస్సులో మాట్లాడిన సుబ్రహ్మణ్యన్.. ఎల్అండ్‌టీలో ప్రస్తుతం రెండున్నర లక్షల మంది ఉద్యోగులున్నారు. 4 లక్షల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ సమస్య లేదని, కార్మికులు లభించకపోవడమే ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కొన్నేళ్లుగా కార్మికులు ఉపాధి కోసం వేరే ఊర్లకు వెళ్లడంలేదని, స్థానికంగా వారికి ఆదాయం మెరుగ్గా ఉండొచ్చు, దానికి తోడు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతుండటం అయ్యుండొచ్చు. అందువల్లే కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపించట్లేదని తెలిపారు. కార్మికుల్లోనే కాకుండా వైట్ కాలర్ ఉద్యోగాల్లో ప్రొఫెషనల్స్ విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. తాను ఒకప్పుడు ఎల్అండ్‌టీలో ఇంజనీర్‌గా చేరినప్పుడు తన పై అధికారి ఢిల్లీలో ఉద్యోగం కంటే వెళ్లేవాడిని, ఈరోజుల్లో అలా ఎవరినీ అడిగే పరిస్థితి లేదు. ఉద్యోగాన్ని కూడ వదిలి వెళ్లిపోతున్నారని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద దుమారం రేపుతున్నాయి.