Jiohotstar: ఒకే ప్లాట్‌ఫామ్‌గా జియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

by S Gopi |
Jiohotstar: ఒకే ప్లాట్‌ఫామ్‌గా జియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎంటర్ టైన్‌మెంట్ పరిశ్రమలో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్‌ అడుగుపెట్టింది. ఇప్పటికే విలీన ప్రక్రియను పూర్తి చేసుకున్న రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాయింట్ వెంచర్ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా ఓటీటీలు రెండూ కలిసి 'జియోహాట్‌స్టార్' యాప్‌గా ఓటీటీ సేవలను అందించనున్నాయి. శుక్రవారం నుంచి వీటి సేవలు మొదలవగా, రూ. 149 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ విలీనంతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఒకచోటకు చేరాయి. వీటి కంటెంట్, స్పోర్ట్స్ కవరేజ్ విస్తృతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వనున్నాయి. మొత్తంగా 3 లక్షల గంటల ఎంటర్‌టైన్‌మెంట్, 50 కోట్ల మందికి పైగా యూజర్లతో జియోహాట్‌స్టార్ ఓటీటీ పరిశ్రమలో కీలకంగా మారనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

ఇప్పటికే ఉన్న యూజర్లు

కొత్త జియోహాట్‌స్టార్ ద్వారా ఇప్పటికే ఉన్న యూజర్లకు మామూలుగానే ఓటీటీ సేవలు లభిస్తాయి. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు ఎప్పటిలాగే సేవలు పొందుతారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాప్‌ను వాడుతున్న వారికి యాప్‌ అప్‌డేట్ ద్వారా జియో హాట్‌స్టార్‌గా మారుతుంది. అలాగే, జియో సినిమా ఉపయోగిస్తున్న వారు యాప్‌లో జియో హాట్‌స్టార్‌కు రీడైరెక్ట్‌ అవుతారు.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇవే

జియోహాట్‌స్టార్ కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్‌లు ఎలాంటి మార్పులు లేకుండా వారి ప్రస్తుత ప్లాన్‌లతో కొనసాగుతారు. ఈ ప్లాన్‌లలో మొబైల్‌ ప్లాన్‌ రూ. 149 నుంచి మొదలవుతుంది. ఇది మూడు నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వార్షిక ప్లాన్ ధర రూ. 499గా ఉంది. ఈ ప్లాన్‌ను కేవలం మొబైల్‌లో మాత్రమే చూడవచ్చు. ఆ తర్వాత రెండు డివైజ్‌లను స్పోర్ట్ చేసే సూపర్ ప్లాన్‌ రూ. 299తో మూడు నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో యాడ్స్ వస్తాయి. ఇందులో వార్షిక ప్లాన్ ధర రూ. 899గా నిర్ణయించారు. ప్రీమియం ప్లాన్‌లో యాడ్స్ ఉండవు, కానీ లైవ్ కంటెంట్‌లో యాడ్స్ వస్తాయి. ఇందులో నెలకు రూ. 299గా చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల ప్రీమియం (యాడ్-ఫ్రీ) ప్లాన్‌ రూ. 449 ఉంది. వార్షిక ప్లాన్ ధర రూ. 1,499గా ఉంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed