- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jio-IPL: 90 రోజుల పాటు ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

దిశ, బిజినెస్ బ్యూరో: మొన్నటివరకు క్రికెట్ అభిమానుల కోసం ఐపీల్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేసిన తర్వాత జియోహాట్‌స్టార్ విలీనంతో షాక్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మ్యాచ్‌లను చూడాలంటే తప్పనిసరిగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందుగా జియో క్రికెట్ అభిమానులకు పెద్ద గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై జియో యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వినియోగించే ఆఫర్‌ను ప్రకటించింది. అంతేకాకుండా జియో ఎయిర్‌ఫైబర్ సేవలనును 50-రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇందులోనే అపరిమిత వైఫై, 11 ఓటీటీ యాప్‌లతో పాటు 800 కంటే ఎక్కువ ఓటీటీ ఛానల్స్ వీక్షించవచ్చు. ఈ ఆఫర్లను పొందడానికి యూజర్లు రూ. 299, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కొత్త కస్టమర్లతో పాటు పాత వారికి కూడా ఇది వర్తిస్తుంది. తద్వారా మొబైల్, టీవీల్లో 4కె స్ట్రీమింగ్ సేవలు లభిస్తాయి. ఈ ఆఫర్ ఈ నెల 17-31 తేదీల మధ్య అందుబాటులో ఉండనుంది. ఉచితంగా జియోహాట్‌స్తార్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం మాత్రం ఐపీఎల్ సీజన్ మొదలయ్యే మార్చి 22న యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత 90 రోజుల వరకు ఉపయోగించవచ్చు.
Read More..
Jio Exclusive Offer: ఇదిరా అంబానీ మావ గొప్పదనం.. ఐపీఎల్ లవర్స్ కోసం భలే ఆఫర్లు ఇచ్చేశాడుగా!