- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jawa: మార్కెట్లోకి విడుదలైన జావా కొత్త మోడల్.. ధర రూ.1.99 లక్షలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మోటార్‌సైకిల్స్ తయారీ కంపెనీ జావా యెజ్డీ మార్కెట్లోకి కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘జావా 42 ఎఫ్‌జె 350’. ప్రారంభ ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కొత్త స్టైలీష్ ఇంజన్, డిజైన్‌తో వచ్చింది. 334 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటార్‌ను దీనిలో అందించారు. ఆరు గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైకుకు కంపెనీ వ్యవస్థాపకుడు ఫ్రాంటిసెక్ జానెసేక్ పేరును పెట్టడం గమనార్హం. దీని ఇంజన్ 22 bhp పవర్, 28 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ముందు LED హెడ్‌ల్యాంప్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్,USB ఛార్జింగ్ పోర్ట్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, మెరుగైన భద్రత కోసం డ్యూయల్-చానల్ ABS అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. పాత మోడల్ కంటే కొత్త దానిలో సైడ్ ప్యానెల్‌లు, సీటు, హ్యాండిల్‌బార్‌ను రీడిజైన్ చేశారు. రైడింగ్‌లో సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. బైక్ ఐదు కలర్స్‌లలో లభిస్తుంది. జావా కంపెనీ నుంచి 42 లైనప్‌కు వచ్చిన మూడో మోడల్ ఇది. ఈ బైక్ కోసం బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. కంపెనీ త్వరలో డెలివరీని ప్రారంభించనుంది. పోటీ పరంగా ఈ మోడల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాస్ 350 లకు పోటీ ఇస్తుంది.