- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండు వేసవిలో కేరళ అందాలు.. IRCTC స్పెషల్ ప్యాకేజీ
దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ టైం లో చాలా మంది కొత్త ప్రాంతాలను చూడాలనుకుంటారు. ముఖ్యంగా మండు వేసవిలో చల్లటి గాలులు, కొండలు, లోయలు, నీళ్లలో ప్రయాణం మొదలగు వాటిని అందించే ప్లేస్‌లలో మొదటి స్థానంలో ఉండే కేరళనే ఎక్కువ మంది తమ సమ్మర్ టూర్‌గా ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా సందర్శనీయ ప్రదేశాల్లో కేరళ కూడా ఒకటి. మరి అలాంటి కేరళ అందాలను చూడాలనుకుంటున్న వారికి IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కొత్తగా తక్కువ ధరలో ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఉంటుంది. దీనిలో భాగంగా మున్నార్, అలెప్పీ ప్రాంతాలను చూపిస్తారు. మే 9,16,23,30 తేదీల్లో టూర్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు నుంచి యాత్ర మొదలవుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో ప్రయాణం ఉంటుంది.
* మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర మొదలవుతుంది.
* రెండో రోజు మధ్యాహ్నం 1 గంటకు ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి మున్నార్‌కు చేరుకుని, ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో బస చేస్తారు.
* మూడో రోజు మార్నింగ్ టిఫిన్ చేశాక, అక్కడ దగ్గరలోని మెట్టుపట్టి డ్యామ్, ఎరవికుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం చూస్తారు. ఆ రాత్రి అక్కడే స్టే చేస్తారు.
* నాలుగో రోజు మార్నింగ్ అలెప్పీ కి వెళ్తారు. అక్కడి హోటల్‌కు చేరుకున్నాక, బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక, దగ్గరలోని ప్రదేశాలను చూస్తారు. మళ్లీ ఆ రాత్రి హోటల్‌లో బస చేస్తారు.
* ఐదో రోజు ఉదయం అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుపయనమవుతారు.
* ఆరో రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది.
టూర్ ధరల వివరాలు:
* సింగిల్ షేరింగ్‌కు రూ. 32,230.
* డబుల్ షేరింగ్‌కు రూ. 18,740.
* ట్రిపిల్ షేరింగ్‌కు రూ. 15,130.