IPOs: స్టాక్ మార్కెట్లో వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ కంపెనీలు ఇవే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-30 10:14:42.0  )
IPOs: స్టాక్ మార్కెట్లో వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ కంపెనీలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్(Satck Market)లో ఈ ఏడాది ఐపీఓల(IPOs) సందడి నెలకొన్న విషయం తెలిసిందే. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని బడా కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఏడాది దాదాపు 90 సంస్థలు ఐపీఓకు రాగా.. సుమారు 1.62 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాయి. ₹27,870 కోట్లతో హ్యుండాయ్ మోటార్స్(Hyundai Motors) ఈ ఇయర్ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచింది. కాగా వచ్చే సంవత్సరం కూడా పలు దిగ్గజ కంపెనీలు ఐపీఓలతో దలాల్ స్ట్రీట్ లోకి రానున్నాయి. ఇందులో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్(LG Electronics), ఫ్లిప్‌కార్ట్‌(Flipkart), జియో(JIO), హీరో ఫిన్ కార్ప్(Hero Fincorp), కెనరా రిబోకో(Canara Riboco) వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC), టాటా మోటార్స్(Tata Motors) వంటి ప్రముఖ సంస్థల అనుబంధ కంపెనీలు కూడా ఐపీఓలకు రానున్నాయి. గ్రీవ్స్ కాటన్(Greaves Cotton) తన ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీని(GEM) ఐపీఓ ద్వారా మార్కెట్ లో లిస్ట్ చేసేందుకు బోర్డు ఆమోదం కూడా తెలిపింది. మార్కెట్ పరిస్థితులు పాజిటివ్(Positive)గా ఉంటే మరికొన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి క్యూ కట్టొచ్చు. ఇక 2025లో జియో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశమున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Next Story