జనవరిలో 5.2 శాతంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి!

by Harish |   ( Updated:2023-03-10 13:59:37.0  )
జనవరిలో 5.2 శాతంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి!
X

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) ఈ ఏడాది జనవరిలో 5.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో ఐఐపీ సూచీ 2 శాతమే పెరిగింది. 2022, డిసెంబర్‌లో ఇది 4.3 శాతంగా ఉందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. శుక్రవారం విడుదలైన ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో తయారీ రంగ ఉత్పత్తి 3.7 శాతం వృద్ధి చెందింది. గనుల రంగ ఉత్పత్తి 8.8 శాతం, విద్యుదుత్పత్తి 12.7 శాతం పెరిగాయి. భారీ యంత్ర పరికరాల విభాగం గణనీయంగా 13.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10 నెలలకు సంబంధించి ఐఐపీ వృద్ధి 5.4 శాతంగా ఉందని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 13.7 శాతం కంటే తగ్గిందని గణాంకాలు తెలిపాయి.

Also Read..

భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు!

Advertisement

Next Story

Most Viewed