ఈ ఏడాది భారత్ వృద్ధి 7 శాతం: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

by Harish |
ఈ ఏడాది భారత్ వృద్ధి 7 శాతం: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
X

సిడ్నీ: భారత్ ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థలో ఏడు శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని, అలాగే వచ్చే ఐదేళ్ళ కాలంలో ఇంకా మెరుగైన వృద్ధితో ఈ లక్ష్యాన్ని దాటుతామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ASPI), ఇండియాస్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) సంయుక్త సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వృద్ది రానున్న ఒకటిన్నర దశాబ్దాల పాటు 7-9 శాతం రేంజ్‌లో ఉంటుందని అన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ద్వారా ఎక్కువ పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టవచ్చు అని పేర్కొన్నారు.

భారత్ నుంచి సుమారుగా ఒక మిలియన్ మంది విద్యార్థులు ఆస్ట్రేలియాకు వచ్చి చదువుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలను భారత్‌లో స్థాపించాలని కొరుకుంటున్నాము. దీని వలన భారత విద్యార్థులకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి నైపుణ్యం కలిగిన, పోటీతత్వ ప్రతిభతో విద్యార్థులను తయారు చేయడానికి భారత్-ఆస్ట్రేలియా సహకారం బాగా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

అలాగే, ఆస్ట్రేలియన్ మంత్రి క్రిస్ బ్రౌన్‌తో జరిగిన సమావేశంలో బిలియనీర్ జార్జ్ సోరోస్‌ భారతదేశం, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సోరోస్ న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచం మొత్తం ఎలా పనిచేస్తుందో తన అభిప్రాయాలు నిర్ణయిస్తాయని ఇప్పటికీ భావిస్తున్నాడు. ఇలాంటి వారు ఎన్నికల్లో తమకు కావాల్సిన వారు గెలిస్తే ఆ ఎన్నికలు సవ్యంగా జరిగినవని, ఒకవేళ ఫలితాలు భిన్నంగా ఉంటే అది లోపభూయిష్ట ప్రజాస్వామ్యమని అంటారని విదేశాంగ మంత్రి సోరోస్‌‌ వ్యాఖ్యలను విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed