రూ.15 లక్షల కోట్లకు భారతదేశ ఆర్థిక లోటు

by Disha Web Desk 17 |
రూ.15 లక్షల కోట్లకు భారతదేశ ఆర్థిక లోటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ ఆర్థిక లోటు ఏప్రిల్ 2023-ఫిబ్రవరి 2024 కాలంలో రూ.15.01 లక్షల కోట్లకు పెరిగిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మార్చి 28న విడుదల అయిన డేటా చూపించింది. ఇది ఫిబ్రవరి చివరి నాటికి సవరించిన వార్షిక లక్ష్యంలో 86.5 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.14.53 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక లోటు అనేది ప్రభుత్వ మొత్తం ఖర్చు, రాబడి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఏప్రిల్-ఫిబ్రవరి 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రభుత్వ వ్యయం రూ.37.47 లక్షల కోట్లు కాగా, గత ఏడాది ఇది రూ.34.94 లక్షల కోట్లుగా నమోదైంది.

సమీక్ష కాలంలో ప్రభుత్వ నికర పన్ను రాబడులు రూ.18.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే పన్నేతర ఆదాయం రూ.3.6 లక్షల కోట్లుగా ఉంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) విడుదల చేసిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 2024 నాటికి ప్రభుత్వ మొత్తం వసూళ్లు రూ.22.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం ఆర్థిక లోటు లక్ష్యాన్ని 10 బేసిస్ పాయింట్ల ద్వారా స్థూల జాతీయోత్పత్తిలో 5.8 శాతానికి తగ్గించిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని 5.1 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.


Next Story

Most Viewed