Core Industries: జూలైలో 6.1 శాతం వృద్ధి చెందిన కీలక రంగాలు

by S Gopi |
Core Industries: జూలైలో 6.1 శాతం వృద్ధి చెందిన కీలక రంగాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో కీలక ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి వార్షిక ప్రాతిపదికన జూలైలో 6.1 శాతం పెరిగిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. అంతకుముందు జూన్ నెలలో 8 ప్రధాన రంగాల(ఐసీఐ) సంయుక్త సూచీ 4 శాతంగా నమోదైంది. గతేడాది జూలైలో 8.5 శాతంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ప్రధానంగా సమీక్షించిన నెలలో ఉక్కు, విద్యుత్, బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, ఎరువుల రంగాల్లో ఉత్పత్తి సానుకూలంగా ఉండటం కలిసొచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూలైలో పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 6.6 శాతం, స్టీల్ 7.2 శాతం, సిమెంట్ ఉత్పత్తి 5.5 శాతం, బొగ్గు ఉత్పత్తి 6.8 శాతం పెరిగింది. విద్యుదుత్పత్తి 7 శాతం, ఎరువుల ఉత్పత్తి 5.3 శాతం పెరిగింది. ముడి చమురు 2.9 శాతం, సహజ వాయువు 1.3 శాతం క్షీణించాయి.

Advertisement

Next Story