భారత తొలి క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ బాంబే, టీసీఎస్

by S Gopi |
భారత తొలి క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ బాంబే, టీసీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సెమీకండక్టర్ చిప్‌ల నాణ్యతను పరీక్షించే అధునాతన సెన్సింగ్ సాధనం, భారత మొట్టమొదటి క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ను అభివృద్ధి చేసేందుకు ఐటీ కంపెనీ టీసీఎస్, ఐఐటీ బాంబే మంగళవారం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వచ్చే రెండేళ్లలో టీసీఎస్ నిపుణులు ఐఐటీ బాంబే పీక్వెస్ట్ ల్యాబ్‌లో తయారు చేసే కొత్త సెన్సింగ్ టూల్.. చిప్‌లలో వైఫల్యాలను తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఇది సెమీకండక్టర్ చిప్‌ల నాణ్యతను నియంత్రిస్తుంది. తద్వారా చిప్‌ల ఉత్పత్తిలో భద్రత, విద్యుత్ పరికరాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. క్వాంటం ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడంలో టీసీఎస్‌తో సహకరించడం సంతోషిస్తున్నాం. టీసీఎస్‌తో కలిసి పనిచేయదం ద్వారా ఎలక్ట్రానిక్స్, సహా వివిధ రంగాలలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నామని ఐఐటీ బాంబేలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. కస్తూరి సాహా చెప్పారు. రెండో క్వాంతం వేగంగా పురోగమిస్తోంది. సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీలలో అత్యాధునిక సామర్థ్యాలను పెంపిందించేందుకు వనరులను, నైపుణ్యాన్ని సమీకరించడం అత్యవసరమని టీసీఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హారిక్ విన్ తెలిపారు.



Next Story