- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్న టాటా ఇండియన్ హోటల్స్
దిశ, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న దేశీయ ఆతిథ్య రంగాన్ని తిరిగి వృద్ధి బాటలో ఉంచేందుకు టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్‌సీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి ఏకంగా లక్ష మందికి ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. టాటాకే చెందిన టీసీఎస్ సహకారంతో ఆన్‌లైన్ ట్రైనింగ్ ద్వారా దీన్ని సాధించాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాదికి నాటికి దేశవ్యాప్తంగా నైపుణ్య శిక్షణా కేంద్రాల సంఖ్యను 50కి పెంచనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కంపెనీ పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ పాలన చొరవలో భాగంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవకాశం ఇవ్వనుంది. అలాగే, లక్ష మందిలో 25 శాతానికి సమానమైన మహిళలకు ట్రైనింగ్ ఇవనుంది. కరోనా ప్రభావం తర్వాత గత రెండేళ్లలో బలమిన వృద్ధిని చూస్తున్న దేశీయ ఆతిథ్య రంగంలో నెలకొన్న డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. 'ప్రస్తుతం పరిశ్రమలో వృద్ధికి అవకాశాలు భారీ పెరిగాయి. కానీ అందుకు తగినట్టుగా ప్రతిభ ఉన్న ఉద్యోగుల కొరత ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2030 నాటికి 1,00,000 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని ' ఐహెచ్‌సీఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ గౌరవ్ పోఖారియాల్ చెప్పారు.