EPFO: PF అకౌంట్‌ ఉన్నవాళ్ల కోసమే ఈ న్యూస్.. పదేళ్ల సర్వీస్‌పై పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోండి

by Vennela |
EPFO: PF అకౌంట్‌ ఉన్నవాళ్ల కోసమే ఈ న్యూస్.. పదేళ్ల సర్వీస్‌పై పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోండి
X

EPF Pension Formula: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇది దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా స్కీముల్లో ఒకటి. ఈ స్కీము కింద సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు, సర్వీస్ పీరియడ్ సహా వారి శాలరీని బట్టి రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ అందుకుంటారు. ఇది 1995 నవంబర్ 16న లాంఛ్ అయ్యింది. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు పదవీవిరమణ తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు స్థిర ఆదాయం అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఏర్పాటు అయ్యింది ఈ పీఎఫ్ స్కీమ్.ఈ పీఎఫ్ ఏంటి ఎన్నేళ్ల సర్వీసుపై పెన్షన్ ఎంత జీతంపై వస్తుందన్న విషయాలు తెలుసుకుందాం.

ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం ఇందులో 10ఏళ్ల సర్వీస్ ఉండాలి. ఇక పదవీవిరమణ వయస్సు 58ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా పెన్షన్ వస్తుంది. నెలలవారీగా కనీస పెన్షన్ రూ. 1000 వస్తుంది. ప్రస్తుత పే స్కేల్ ప్రకారం గరిష్టంగా రూ. 7500 వరకు పెన్షన్ వస్తుంది.

పెన్షన్ పొందాలనుకున్న ఉద్యోగి కచ్చితంగా 10ఏళ్ల పాటు సర్వీస్ చేసి ఉండాలి. 58ఏళ్లు దాటి ఉండాలి. కచ్చితంగా ఈపీఓప్ఓ పేరు నమోదు అయి ఉండాలి. తన ఉద్యోగ కాలంలో మొత్తం ఈపీఎఫ్ఓ కు కాంట్రిబ్యూషన్స్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా ఉద్యోగి వేతనం నుంచి 12శాతం ఈపీఎఫ్ అకౌంట్ కు వెళ్తుంది. కంపెనీ కూడా జమ చేసే 12శాతంలో 8శాతానికిపైగా ఈపీఎస్ స్కీంకు వెళ్తుండగా 3శాతానికిపైగా మాత్రం ఈపీఎఫ్ కు వెళ్తుంది. 2014 నుంచి కనీస పెన్షన్ రూ. 1000 గరిష్ట పెన్షన్ రూ. 7500 ఉంది.

అంటే 10ఏళ్లు సర్వీస్ చేసిన వారికి పదవీ విరమణ తర్వాత పీఎఫ్ ఎలా ఎంత వస్తుందనేది ఈ ఫార్ములా ప్రకారం తెలుసుకుందాం.

మంత్లీ పెన్షన్ = {(పెన్షనబుల్ శాలరీXపెన్షనబుల్ సర్వీస్)/70}

పెన్షనబుల్ సాలరీ..ఇది గత 60 నెలల సగటు వేతనం (గరిష్ట పరిమితి రూ. 15 వేలు ఉంది.), పెన్షనబుల్ సర్వీస్ ఇది మీరు పని చేసిన కాలం. దీనిని బట్టి పైఫార్ములాతో 10ఏళ్ల సర్వీసుపై పెన్షన్ ఎంత వస్తుందో లెక్కించవచ్చు. నెలలవారీగా పెన్షన్ = {(రూ. 15000X10)/70}= రూ. 2143. అంటే ఇక్కడ 10ఏళ్లు సర్వీసులో కూడా నెలవారీగా రూ. 2143 చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ 35ఏళ్ల సర్వీసు ఉంటే అప్పుడు రూ. 15000X35/70= రూ. 7500 గరిష్ట పెన్షన్ అందుతుంది. గరిష్ట వేతన పరిమితి రూ. 15 వేలుగా ఉండగా.. దీనిని రూ. 21 వేలకు పెంచొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే అప్పుడు పెన్షన్ కూడా పెరుగుతుంది.

Next Story

Most Viewed