IDFC First Bank: 'ఫస్ట్ ఎర్న్' పేరుతో రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

by S Gopi |
IDFC First Bank: ఫస్ట్ ఎర్న్ పేరుతో రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ యూపీఐ ఆధారిత సెక్యూర్‌డ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. గ్లోబల్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్ రూపే భాగస్వామ్యంతో 'ఫస్ట్ ఎర్న్' పేరుతో ఈ క్రెడిట్ కార్డును బ్యాంకు తీసుకొచింది. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కస్టమర్లకు ఈ కార్డులను జారీ చేయనుండగా, దీని ద్వారా వినియోగదారులు యూపీఐ లావాదేవీలు నిర్వహించవచ్చని బ్యాంకు తెలిపింది. ప్రత్యేకంగా ఈ కార్డు ద్వారా చేసే ఒక్కో లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌తో పాటు రివార్డులు కూడా లభించనున్నాయి. ఈ క్రెడిట్ కార్డును ఆన్‌లైన్‌లో తక్షణమే పొందవచ్చు. బ్యాంకు వివరాల ప్రకారం.. ఈ కార్డు తీసుకున్నవారికి మొదటి యూపీఐ లావాదేవీకి రూ. 500 వరకు పూర్తిగా వంద శాతం క్యాష్‌బ్యాక్ పొందే వీలుంటుంది. ఈ సదుపాయం కార్డు పొందిన మొదటి 15 రోజుల వరకే ఉంటుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి చేసే యూపీఐ లావాదేవీలపై 1 శాతం, ఇతర బ్యాంకుల యూపీఐ నుంచి చేసే లావాదేవీలు, ఇతర చెల్లింపులపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు బ్యాంకు వివరించింది. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ ద్వారా సినిమా టికెట్ల కొనుగోలుపై రూ. 1,000 వరకు 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. ఇక, రూ. 1,399 విలువైన రోడ్ అసిస్టెంట్స్, కార్డును పోగొట్టుకుంటే రూ. 25,000 వరకు లాస్ కార్డ్ లయబిలిటీ, రూ. 2 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా అందించనున్నట్టు బ్యాంకు వెల్లడించింది.

Next Story

Most Viewed