IDBI Bank: ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్

by S Gopi |
IDBI Bank: ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దేశీయ బ్యాంకుల్లో తగ్గుతున్న డిపాజిట్లపై హెచ్చరికలు చేస్తున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్లు పెంచేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 444 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీపై అత్యధికంగా 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. అలాగే 375 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీపై 7.75 శాతం వడ్డీని బ్యాంకు నిర్ణయించింది. ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద అందిస్తున్న ఈ రెండు కాలవ్యవధుల ఎఫ్‌డీలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకే వీటిపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. ఈ ఆఫర్ 2024, సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. కస్టమర్‌లు బ్యాంక్ వెబ్‌సైట్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను తెరిచే వీలుంటుంది. ఇవి రెండింటితో పాటు ఐడీబీఐ బ్యాంక్ ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద 700 రోజుల కాలపరిమిపై 7.7 శాతం, 300 రోజుల కాలవ్యవధిపై 7.55 శాతం వడ్డీని అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed