షాపింగ్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే సేల్‌.. ఏకంగా 80% వరకు డిస్కౌంట్స్‌

by Kavitha |   ( Updated:2024-07-13 07:16:28.0  )
షాపింగ్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే సేల్‌.. ఏకంగా 80% వరకు డిస్కౌంట్స్‌
X

దిశ, ఫీచర్స్: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే పేరుతో సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. జూలై 20,21వ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లతో పాటు, హోం యాక్సెసరీస్ పై భారీ డిస్కౌంట్స్‌ అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రధాన ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం అదిరిపోయే సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌ GOAT పేరుతో ఒక సేల్‌ను నిర్వహించనుంది. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ పేరుతో భారీ ఆఫర్లను అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ యాక్సెసరీస్‌, హోం యుటిలిటీస్‌తో పాటు స్మార్ట్‌ టీవీలపై భారీ ఆఫర్లను అందించనున్నారు. అయితే ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 15పై డిస్కౌంట్ లభించనుంది. ఇక స్మార్ట్‌ టీవీలపై ఏకంగా 80 వాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నారు. అలాగే ఐపోన్‌ 15, వివో, రెడ్‌మీ, వన్‌ప్లస్‌ వంటి బ్రాండ్‌లపై డిస్కౌంట్లు లభించనున్నాయి. వీటితో పాటు టీవీలు, వాషింగ్ మెషీన్, ఆర్‌ఓ, ప్రింటర్, మిక్సర్ మొదలైన వాటిపై 80% వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story