- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గూగుల్ పే స్క్రాచ్‌కార్డ్‌లో భారీ అమౌంట్
దిశ, డైనమిక్ బ్యూరో: గూగుల్ పే యూజర్లకు జాక్‌పాట్ తగిలింది. సాంకేతిక లోపంతో కొందరు గూగుల్ పే యూజర్లకు 10 నుంచి 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.80 వేలు) మేర స్క్రాచ్ కార్డ్ రూపంలో వారి ఖాతాల్లో జమ అయినట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో కొందరు జాక్‌పాట్ తగలిందని వెంటనే వారి అవసరాలకు కూడా ఉపయోగించుకున్నారు. అయితే, స్క్రాచ్ కార్డ్ రూపంలో ఇచ్చిన అమౌంట్‌ను గూగుల్ పే మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. వాళ్ల సర్వర్‌లో వచ్చిన టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరిగిందని ప్రకటించింది. జరిగిన తప్పిదాన్ని గూగుల్ పే గుర్తించి పొరపాటుగా జమ చేసిన మొత్తాన్ని మళ్లీ తిరిగి డెబిట్ చేసింది.
కాకపోతే అప్పటికే జమ అయిన మొత్తాన్ని ఖర్చు చేసిన వారి విషయంలో ఏమీ చేయలేకపోయింది. అలాంటి యూజర్ల విషయంలో తదుపరి ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేసింది. గూగుల్ పేలో గ్లిచ్ విషయాన్ని జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘గూగుల్ పే ర్యాండమ్ గా యూజర్లకు ఉచితంగా డబ్బులు ఇస్తోంది. నేను ఇప్పుడే గూగుల్ పే తెరిచి చూశాను. 46 డాలర్లు రివార్డుగా జమ అయినట్టు కనిపించింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎర్రర్ కారణంగా డబ్బు జమ అయిందని, ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నట్టు గూగుల్ పే నుంచి మెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు. గూగుల్ పే యాప్ తెరిచి రివార్డ్స్‌ను ఓ సారి చెక్ చేసుకోండంటూ ఆయన సూచించారు.
Read more: