Investment Plan: బంగారం, పీపీఎఫ్‌లో పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఇవే

by Vennela |
Investment Plan: బంగారం, పీపీఎఫ్‌లో పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: Investment Pan: పెట్టుబడి(Investment) పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా. ఈక్విటీ(Equity) బంగారం (Gold), పీపీఎఫ్(ppf) ఇలా ఏది ఎంపిక చేసుకోవాలో అర్థం కావడం లేదా? మీరు సరైన నిర్ణయం తీసుకోవడంలో ఈ సమాచారం మీకు సహాయపడే అవకాశం ఉంది. మీరు కొత్తగా పెట్టుబడి (Investment) పెట్టేవారైనా లేదా ఇంతకు ముందు మీకు అనుభవం ఉన్నా సరే..మీ స్మార్ట్ లక్ష్యాలను చేరుకోవడంలో మీకున్న బెస్ట్ ఆప్షన్స్ ను సెలక్ట్ చేసుకోండి.

మనం సంపాదించిన మొత్తాన్ని మంచి మార్గాల్లో పెంచుకోవడానికి ఇన్వెస్ట్ మెంట్(Investment) ఒక మంచి తెలివైన ఎంపికగా చెబుతారు ఆర్థిక నిపుణులు. అయితే సరైన స్ట్రాటజీని ఎంచుకోవడంలోనే అసలు సమస్య ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రజాదారణ పొందిన మూడు పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. అవి బంగారం, ఈక్విటీలు, పీపీఎఫ్ ఇందులో దేని ప్రయోజనాలు దానికే ప్రత్యేకం. రాబడితోపాటు నష్టాల రిస్క్ కూడా ఉంటుంది. వీటన్నింటిని దాటుకుని మీరు మంచి ఎంపికను చేసుకోవాలి.

పీపీఎఫ్(ppf)

పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది మీ ఇన్వెస్ట్ మెంట్ మొత్తానికి అధిక భద్రతను కల్పించే దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రభుత్వం తరపున దీనికి భద్రత ఉంటుంది. పెట్టుబడిపెట్టిన మొత్తం మీద ప్రయోజనకరమైన వడ్డీ రేటుతోపాటు మంచి రాబడి కూడా ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ ను తీసుకునేందుకు మీరు భారతదేశ పౌరుడై ఉండాలి. ఇక్కడే నివసించాలి. అర్హత కలిగిన వారు తమ పిల్లల పేరు మీద కూడా అకౌంట్ తీసుకోవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ఏడాదికి 7.1శాతంగా ఉంది. దీని కాలపరిమితి 15ఏళ్లు. మరో 5ఏళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ఏటా చక్రవడ్డీ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఇది మార్చి 3న చెల్లిస్తారు. ఇందులో ఏడాదికి రూ. 500 నుంచి 1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది స్థిరమైన వడ్డీతోపాటు రిస్క్ లేని ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటికి సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇక పీపీఎఫ్ లో ఏటా రూ. 1.2 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి రూ. 32,54,567 మొత్తం వస్తుంది. రిస్క్ ఇష్టపడిన వారికి పీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది.

ఈక్విటీలు (Equity)

ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం అంటే ఒక కంపెనీ స్టాక్ ను కొనుగోలు చేయడం ద్వారా దానిపై పెట్టే పెట్టుబడి మొత్తం. ఈ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ లో మారుతుంటాయి. అయితే ఇవి పెట్టుబడి అసలు విలువను పెంచుతాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ పెడితే..నష్టభయాన్ని భరించగలిగితే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటి వల్ల లాభాలతోపాటు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులు, ఆర్థిక మాంద్యం, కంపెనీ నిర్దిష్ట కారకాల వంటి విషయాల వల్ల ప్రభావితం అవుతుంటాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్స్, సిప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందులో కాస్త అవగాహన ఉన్నవారు వీటిని మేనేజ్ చేస్తుంటారు. డబ్బును సరైన కంపెనీని ఎంచుకుని పెట్టుబడి పెడుతుంటారు. షేర్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ లో లాభాలు కోరుకుంటే వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మార్కెట్ హెచ్చు తగ్గులు వీటిని కూడా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి.

బంగారం (gold)

స్టాక్ మార్కెట్ రిస్కును ఇష్టపడనివారు చాలా మంది సంప్రదాయ మార్గమైన బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటారు. బంగారం ధరలు పెరుగుతున్నాయి. గడిచిన 10ఏళ్లలో బంగారం ధరలు 237.5శాతం పెరిగాయి. అంటే 10ఏళ్లలో బంగారంపై ఇన్వెస్ట్ చేసివారు భారీగా లాభపడ్డారు. బంగారంపై స్పష్టమైన విలువగల ఒక ఆస్తి. ఇతర ఆస్తుల మాదిరిగా అధిక తరుగుదల లేదా అస్థిరత అనేది ఉండదు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అదే సమయంలో సులభంగా డబ్బును చేసుకోవడానికి వీలుంటుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇందులో కూడా బంగారం ధరలు పతనం అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.


Next Story

Most Viewed